ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ శాసన సభ్యులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం మధిర మండల పరిధిలోని రొంపిమల్ల గ్రామంలో నూతనంగా నిర్మించనున్న గ్రామపంచాయతీ భవనానికి 20 లక్షల రూపాయలను మంజూరు చేశారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామ ప్రజలు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.