సన్న బియ్యం పథకంతో పేదవాళ్ల జీవితాల్లో వెలుగులు రావడం ప్రారంభమయ్యాయని డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తెలిపారు. బోనకల్ మండలం రాయనపేటలో మంగళవారం సన్న బియ్యం పథకాన్ని ఆయన ప్రారంభించారు. చింతకాయల వెంకన్న ఇంట్లో భోజనం చేశారు. కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్, బీజేపీలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని, కాంగ్రెస్ కు ప్రజల నుంచి అభినందనలు వెల్లువ పోటెత్తుతుందని తెలిపారు.