
నేడు ప్రపంచ రక్తపోటు దినోత్సవం
అధిక రక్తపోటు (హైపర్టెన్షన్) ప్రపంచవ్యాప్తంగా ఏటా 10 లక్షల మరణాలకు కారణమవుతోంది. దీనిని నియంత్రించడానికి అవగాహన, జాగ్రత్తలు కీలకం. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం మే 17న 'వరల్డ్ హైపర్టెన్షన్ డే' నిర్వహిస్తుంది. భారత్లో 30% జనాభా ఈ సమస్యతో బాధపడుతోంది. అవగాహన లేకపోవడం వల్ల ప్రాణనష్టం జరుగుతోంది. ఆరోగ్యకరమైన జీవనశైలి, ఒత్తిడి నియంత్రణ, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా దీనిని నివారించవచ్చు.