నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్‌కు ఊరట
సినీ నటుడు అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో బన్నీ బెయిల్‌పై బయట ఉన్నారు. తాజాగా అల్లు అర్జున్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతినిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్‌కు హాజరుకావాలన్న నిబంధనకు మినహాయింపు ఇచ్చింది.