
గుండెనొప్పి తట్టుకోలేక.. ఉరేసుకుని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
AP: పశ్చిమ గోదావరి (D), పెనుగొండ (M) సిద్ధాంతంలో గురువారం విషాదం ఘటన జరిగింది. ఈదుబిల్లి నాగలక్ష్మి దుర్గ (18) అనే విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రాసి ఇంటి వద్దనే ఉంటోంది. దుర్గ కొన్నాళ్లుగా గుండెనొప్పితో బాధపడుతుండటంతో ఆమెకు కుటుంబీకులు సర్జరీ చేయించి మందులు వాడుతున్నారు. అయితే గురువారం నొప్పి ఎక్కువగా రావడంతో ఆత్మహత్యకు పాల్పడింది.