ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గురువారం ఖమ్మం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ వద్ద 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్, ఎస్పీ, ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.