ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని మడుపల్లి గ్రామానికి చెందిన పలువురు నిరుపేద విద్యార్థినీయులకు మధిర పట్టణానికి చెందిన ప్రముఖ సామాజిక సేవకులు పుల్లఖండం చంద్రశేఖర రావు ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన లాబ్ ట్యాబ్ లను గురువారం మధిర శాసన సభ్యులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని చేతుల మీదుగా పంపిణీ చేశారు.