చింతకాని: పురాతన బుద్ద విగ్రహం లభ్యం

53చూసినవారు
చింతకాని: పురాతన బుద్ద విగ్రహం లభ్యం
ఖమ్మం జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. చింతకాని మండలం నాగులవంచలో పురాతన బుద్ధుడి విగ్రహం బయటపడింది. అది పాలరాతి విగ్రహంగా చెబుతున్నారు. స్థానిక రైతు కోలేటి నాగేశ్వరరావు వ్యవసాయ క్షేత్రానికి సమీపంలో ఉపాధి హామి పథకం కింద పనిచేస్తున్న కూలీలు మట్టి తవ్వుతుండగా. ఈ విగ్రహం బయటపడింది. అక్కడే మరో 2 శిలలను కూడా గుర్తించారు. ఆ ప్రాంతంలోనే గతంలో మట్టి కుండలు, పాత్రలు లభ్యమైనట్లు స్థానికులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్