మధిర శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయం వద్ద ఏప్రిల్ 16వ తేదీ, బుధవారం శ్రీ సీతారామాంజనేయ కళాపరిషత్ ఆధ్వర్యంలో తెలుగు నాటక రంగ దినోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆరోజు ఉదయం గం. 10-30 నుంచి సాయంత్రం గం. 4-30 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు శ్రీ సీతారామాంజనేయ కళాపరిషత్ అధ్యక్షులు గడ్డం సుబ్బారావు మంగళవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటున్నట్లు వారు వివరించారు.