ఎర్రుపాలెం మండలం వెంకటాపురంలో రైతు సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. నాయకులు దివ్వెల వీరయ్య మాట్లాడుతూ. రైతంగ సమస్యలు పరిష్కారం కోసం ఈనెల 19న సర్దార్ జమలాపురపు కేశవరావు మెమోరియల్ జూనియర్ కాలేజి నందు సదస్సు నిర్వహిస్తున్నామని, ఈ సదస్సుకు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాధినేని రమేష్, బోంతు రాంబాబు హాజరవుతారని తెలిపారు. రైతులు ఈ సదస్సులో అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.