ఎర్రుపాలెం: మహాధర్నాను విజయవంతం చేయండి

84చూసినవారు
ఎర్రుపాలెం: మహాధర్నాను విజయవంతం చేయండి
కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా ఈ నెల 10న హైదరాబాద్లో చేపట్టనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని సీపీఎం మధిర డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాల్ రావు కోరారు. శనివారం ఎర్రుపాలెం మండల కేంద్రంలోని రామిశెట్టి పుల్లయ్య భవనంలో జరిగిన ఆ పార్టీ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతదేశంలో పేదరికం, నిరుద్యోగం, విద్య, వైద్యం, ఆహార భద్రత అన్ని రంగాల్లో మోదీ ప్రభుత్వం వెనుకబడి పోయిందన్నారు.

సంబంధిత పోస్ట్