ఖమ్మం జిల్లా బోనకల్ మండల పరిధిలోని రావినూతల గ్రామంలో మంగళవారం అజక్స్ కాంక్రీట్ లారీ ఢీ కొట్టడంతో రావినూతల గ్రామ మాజీ ఉప సర్పంచ్ బోయినపల్లి కొండ మృతి చెందారు. దీంతో స్థానికులు గమనించి మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.