ఖమ్మం జిల్లా బోనకల్ మండల పరిధిలోని రాయన్న పేట గ్రామానికి చెందిన తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కె. పి చౌదరి సోమవారం ఆర్థిక పరిస్థితులు తట్టుకోలేక గోవాలో ఆత్మహత్య చేసుకొని మృతి చెందారు. వారి మృతదేహాన్ని నేడు వారి స్వస్థలం బోనకల్ మండలం రాయన్నపేట గ్రామానికి తీసుకువచ్చి బంధువులు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.