ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని పలు గ్రామాలలో గల అంగన్వాడీ కేంద్రాలలో గురువారం మండల వైద్యాధికారులు తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లల తల్లులకు తల్లిపాల వలన పిల్లలకు కలిగే ప్రయోజనాలను గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.