గురువారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు పడనున్నాయని అంచనా వేసింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. విద్యుత్ స్తంభాల దగ్గర ఉండకూడదన్నారు.