
భారత్‌పై పాక్ దాడికి టర్కీ మిలిటరీ సాయం!
భారత్‌పై పాక్ దాడికి టర్కీ నుంచి మిలిటరీ సాయం అందినట్టు వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల జరిగిన ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు టర్కీ 350 కంటే ఎక్కువ డ్రోన్లను అందించినట్టు తెలుస్తోంది. డ్రోన్లను అందజేయడమే కాకుండా, వాటి వినియోగంపై పాక్ మిలిటరీకి శిక్షణ ఇవ్వడానికి.. తమ రక్షణ సిబ్బందిని ఇస్లామాబాద్‌కు పంపిందట. అయితే భారత్- పాక్ ఘర్షణలో ఇద్దరు తుర్కియే మిలిటరీ సిబ్బంది చనిపోయినట్టు సమాచారం.