ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ కేంద్రంలోని పలు ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలలో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అధికారులు జాతీయ పతాకాన్ని ఎగరవేసి స్వాతంత్యానికి సమరయోధులు చేసిన ప్రాణ త్యాగాలను గురించి కొన్ని ఆడుతూ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.