ఎర్రుపాలెం మండలం భీమవరం గ్రామంలో బుధవారం భూ రెవిన్యూ సదస్సు మండల తహశీల్దారు సమక్షంలో జరిగింది. గ్రామ ప్రజలు పెద్దఎత్తున హాజరై తమ భూ సమస్యలను పరిష్కరించ వలసిందిగా మండల తహశీల్దారుకు వినతి పత్రంలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల తహశీల్దారు మరియు రెవెన్యూశాఖ సిబ్బంది పాల్గొన్నారు.