తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆదివారం లారీ డ్రైవర్లు నిరవధిక సమ్మెలో భాగంగా మధిరలో ర్యాలీ నిర్వహించారు. పెరిగిన అవసరాలకు అనుగుణంగా డ్రైవర్ల జీతాలు పెంచాలని లారీ డ్రైవర్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. అటు లారీ డ్రైవర్లకు రోజువారి కూలి రూ. 800, రోజుకి బేటా రూ. 100 ఇవ్వాలని చెప్పారు. డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని పేర్కొన్నారు.