మధిర: నేడు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన

59చూసినవారు
మధిర: నేడు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదివారం మధిరలో పర్యటించనున్నారు. మధిరలో రూ. 120 కోట్లతో నిర్మించే అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణానికి ఉదయం 11గంటలకు మధిర ఎక్సైజ్ పోలీస్ స్టే షన్ వద్ద శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత 11-40 గంటలకు వంగవీడులో, 12గంటలకు క్రిష్ణాపురంలో, 12-30గంటలకు ఆత్కూరు పులిగుట్టకు బీటీ రోడ్డు నిర్మాణానికి డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేయనున్నారు.

సంబంధిత పోస్ట్