ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని CITU రాష్ట్ర కమిటీ సభ్యులు శీలం నరసింహారావు పిలుపునిచ్చారు. మధిర మండలం దెందుకూరు గోదాం హమాలీలతో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లుగా తీసుకువచ్చి కార్మికులకు ఎలాంటి హక్కులు లేకుండా, కార్మిక సంఘాలు పెట్టుకునే హక్కు లేకుండా చేస్తుందని దుయ్యబట్టారు.