

BREAKING: 56 మంది పాకిస్తాన్ సైనికులు హతం
పాకిస్తాన్‌ను బలూచిస్థాన్ దెబ్బ మీద దెబ్బ కొడుతుంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ(BLA) పాకిస్తాన్ సైనికులను వెంటాడి మరీ చంపేస్తుంది. తాజాగా దాదాపు 56 మంది పాకిస్తానీలను హతం చేసినట్లు బలూచ్ ఆర్మీ 'ఎక్స్' వేదికగా ఓ వీడియోను విడుదల చేసింది. పాక్ ఆర్మీ కాన్వాయ్‌పై తుపాకులతో కాల్పులు జరపడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.