మధిర ట్యాంక్ బండ్ పై రూ. 6. 45 కోట్ల వ్యయంతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు ఆదివారం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. మధిరను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.