
తమిళనాడు బీజేపీ నూతన అధ్యక్షుడిగా నైనార్ నాగ్రేందన్?
తమిళనాడు బీజేపీ కొత్త అధ్యక్షుడిగా తిరునల్వేలి ఎమ్మెల్యే నైనార్ నాగేంద్రన్ పగ్గాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం అధ్యక్షుడి పదవికి నాగేంద్రన్ ఒక్కరే నామినేషన్ వేయడంతో ఏకగ్రీవంగా ఆయకే పదవి దక్కే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక ప్రస్తుతం ఉన్న అన్నామలై సైతం నాగేంద్రన్ పేరును ప్రతిపాదించగా.. మిగిలిన వారు కూడా దానికి ఆమోదం తెలిపారు. దీంతో తమిళనాడు బీజేపీ నూతన అధ్యక్షుడిగా దాదాపు నాగేంద్రన్ ఫిక్స్ అయినట్లు సమాచారం.