ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని రామన్నపాలెం నుండి మర్లపాడు గ్రామాల వైపు వెళ్లే ఆర్ అండ్ బి రోడ్డుకు అడ్డంగా గురువారం తుమ్మచెట్టు విరిగిపడటంతో వాహనాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కావున అధికారులు స్పందించి పడిపోయిన తుమ్మ చెట్టును తొలగించి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చేయవలసిందిగా ప్రయాణికులు కోరుతున్నారు.