ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని దెందుకూరు గ్రామంలో గల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్యామలరావు ఆధ్వర్యంలో శుక్రవారం పాఠశాలలో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.