ఎన్నికల్లో రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేయాలని బీజేపీ మండల కార్యదర్శి అల్లిక శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో ముదిగొండ మండల తహశీల్దార్ కు రైతాంగ సమస్యలపై వినతి పత్రం అందించారు. రూ. రెండు లక్షల రుణమాఫీ, రైతు భరోసా ఎకరానికి రూ. 15, 000, కౌలు రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ. 12, 000 వంటి పథకాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.