ముదిగొండ: పేకాట ఆడుతున్న నలుగురు అరెస్ట్

553చూసినవారు
ముదిగొండ: పేకాట ఆడుతున్న నలుగురు అరెస్ట్
ముదిగొండ మండలం కమలాపురంలో పేకాట ఆడుతున్న నలుగురు జూదరులను పోలీసులు అరెస్టు చేశారు. పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు సీఐ మురళీ ఆదేశాలతో ఏఎస్ఐ సాంబశివరావు తమ సిబ్బందితో కలిసి దాడులు చేశారు. ఈ దాడిలో రూ. 3, 130 నగదును స్వాధీనం చేసుకొని నలుగురిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. ఈమేరకు సీఐ మురళీ నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జూదం ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్