ముదిగొండ మండలంలోని మేడేపల్లి, పమ్మి గ్రామాల్లో బుధవారం భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సుల్లో ఆర్డీవో నరసింహారావు, తహశీల్దార్ సునీతా ఎలిజబెత్ పాల్గొన్నారు. భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించారు. రైతుల నుంచి భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. భూ భారతితో సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. భూ సమస్యల పరిష్కార వేదికలుగా రెవెన్యూ సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.