
ఇది విధ్వంసం కాదా?: జగన్
‘పిల్లలను బడులకు పంపేలా తీసుకొచ్చిన అమ్మ ఒడి, నాడు-నేడు, ట్యాబ్ల పంపిణీ, వసతి దీవెనను ఆపేశారు. ఇంగ్లీష్ మీడియంకు పిల్లలను దూరం చేశారు. పిల్లల భవిష్యత్తును నాశనం చేశారు. ఇది విధ్వంసం కాదా?’ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. చేయుత, ఆసరా పథకాలను ఆపేయడం విధ్వంసం కాదా? ఉద్యోగాలివ్వకుండా.. ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టడం విధ్వంసం కాదా? రాష్ట్ర ఆదాయం కాకుండా తన జేబును పెంచుకునే స్కాంలు చేయడం విధ్వంసం కాదా? అని అన్నారు.