ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో ఇసుక బండ్ల యజమానులతో మధిర మండల తహశీల్దార్ రాంబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇసుక బండ్ల యజమానులు ఇష్టానుసారంగా ఇసుక బండ్లు తోలుకుంటూ ప్రజలకు, ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగిస్తే తగిన చర్యలు తీసుకుంటామని ముందస్తుగా హెచ్చరించారు.