
న్యూఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఓటమి
ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌కు పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తన కంచుకోట న్యూఢిల్లీ నుంచి ఓటమి చవిచూశారు. బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ చేతిలో పరాజయం చెందారు. ఇక్కడి నుంచి వరుసగా మూడు సార్లు గెలిచిన ఆయన్ను నాలుగోసారి ప్రజలు తిరస్కరించారు. మరోవైపు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఓటమిపాలయ్యారు. జంగ్‌పురా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి తర్వింధర్ సింగ్ చేతిలో 600 ఓట్లతో తేడాతో ఓడిపోయారు.