ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని మడుపల్లి గ్రామంలో గల రామాలయం నందు శుక్రవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి దీప ధూప నైవేద్యాలతో ప్రత్యేక మంగళ హారతులతో పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.