మధిర పట్టణంలో ఇటీవల 14 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన మినీ ట్యాంకు బండ్ నేడు కళ తప్పి వెలవెలబోతుంది. ట్యాంకు బండ్ మీద ఏర్పాటు చేసిన వస్తువులు, బెంచీలు, చిన్నపిల్లల ఆట వస్తువులు పని చేయకపోవడంతో అధికారుల నిర్లక్ష్యంపై పట్టణ ప్రజలు పెదవి విరుస్తున్నారు. కావున తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి ఈ విషయంపై తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.