ఖమ్మం జిల్లాలో అనివార్య కారణాలు వల్ల తాత్కాలికంగా నిలిపివేసిన కోణార్క్,ఇంటర్సిటీ, భద్రాచలం రోడ్డు ప్యాసింజర్ రైళ్లు 3వ తేదీ నుండి తిరిగి యధావిధిగా కొనసాగించనున్నట్లు రైల్వే శాఖ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.కావున రైల్వే ప్రయాణికులు గమనించి సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.