
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి నోటీసులు
AP: మద్యం కుంభకోణం ఆరోపణల కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 18న విజయవాడ సీపీ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. కాగా, గత ప్రభుత్వం హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందని కూటమి ప్రభుత్వం ఆరోపించింది. అందులో భాగంగా సిట్ దర్యాప్తు చేస్తోంది.