తుపాన్ కారణంగా జిల్లాలో భూగర్భ జలాలు పెరిగాయి. ఎర్రుపాలెం మండలం నర్సింహాపురం గ్రామంలో ఒక రైతు తనకున్న రెండు ఎకరాల పొలంలో ఆరుతడి పంటలు పండించేందుకు వేయించుకున్న బోర్ బావి నుంచి నీరు ఉబికి వస్తోంది. వర్షాల వల్లే నీరు ఉబికి వస్తున్నాయని రైతు తెలిపాడు. దీంతో స్థానిక ప్రజలు, రైతులు ఆసక్తిగా చూస్తున్నారు.