చింతకాని: అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలి

83చూసినవారు
చింతకాని: అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలి
భూ భారతి చట్టం ద్వారా భూ సమస్యల పరిష్కారానికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. మంగళవారం చింతకాని మండలం వందనం పంచాయితీ కార్యాలయంలో నిర్వహిస్తున్న భూ భారతి రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. ప్రతి భూ సమస్యకు భూ భారతి చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. రెవెన్యూ సదస్సును సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు.

సంబంధిత పోస్ట్