తల్లాడ మండలం నూతనకల్ గ్రామంలో గొల్లమందల కృష్ణయ్య శనివారం అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కృష్ణయ్య భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో నూతనకల్ మాజీ సర్పంచ్ తూము శ్రీనివాసరావు మండల నాయకులు పాల్గొన్నారు.