
ఆహారం అడిగిన మామపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కోడలు
ఆహారం అడిగిన మామపై కోడలు పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ హృదయవిదారక ఘటన తమిళనాడులో జరిగింది. తమిళనాడుకు చెందిన ఓ వృద్ధుడు గత కొంతకాలంగా తన కొడుకు, కోడలితో కలిసి నివసిస్తున్నాడు. వృద్ధుడు శారీరకంగా బలహీనంగా ఉండటంతో ఆమెను భోజనం అడగడంతో కోపంతో ఈ అమానుష చర్యకు ఒడిగట్టింది. మంటల్లో కేకలు వేసిన వృద్ధుడిని స్థానికులు హాస్పిటల్కు తరలించారు. ముఖం తీవ్రంగా కాలిపోగా ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు.