టన్ను చేపలు మృత్యువాత... రూ. లక్ష నష్టం

1056చూసినవారు
టన్ను చేపలు మృత్యువాత... రూ. లక్ష నష్టం
నేలకొండపల్లి మండలంలోని బైరవునిపల్లి చెరువులో దాదాపు టన్ను మేర చేపలు మృతి చెందాయి. చెరువులో నీరు అడుగంటడంతో సరిపడా ఆక్సిజన్ అందక చేపలు చనిపోతున్నాయి. గ్రామంలోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యుల నడుమ వివాదంతో చేపల వేట ఆలస్యమైంది. మరోపక్క ఎండ పెరిగి నీరు తగ్గుతుండడంతో చెరువులో చేపలు చనిపోయి తేలుతున్నాయి. ఇప్పటి వరకు రూ. లక్ష మేర నష్టం ఎదురైందని సొసైటీ అధ్యక్షుడు మల్లెబోయిన సైదులు తెలిపారు.

సంబంధిత పోస్ట్