వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు లేకుండా టీపీసీసీ కార్యవర్గం ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ప్రధానకార్యదర్శులను ఏఐసీసీ నియమించింది. సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, నాగసీతారాములు, నూతి సత్యనారాయణ, కట్ల రంగారావు, బేబి స్వర్ణకుమారి లను అధిష్టానం నియమించింది. దీనితో జిల్లా కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.