అంగన్వాడీ పౌష్టికాహారాన్ని అందరూ తీసుకోవాలి

62చూసినవారు
అంగన్వాడీ కేంద్రాలు అందజేస్తున్న పౌష్టికాహారాన్ని అందరూ తీసుకోవాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ పార్వతి సూచించారు. శనివారం నేలకొండపల్లి మండలం మంగాపురంతండా గ్రామపంచాయితీ చిన్నతండా అంగన్వాడీ కేంద్రంలో పోషక వారోత్సవాలు నిర్వహించారు. పోషకాహారం లేకపోవడం వల్ల జరిగే అనర్థాలను వివరించారు. గర్భిణీలు, బాలింతలు పోషకాహారం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్