భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చిందని, గ్రామాల్లో చేపడుతున్న రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యల పరిష్కారానికి దరఖాస్తుల స్వీకరిస్తున్నట్లు తహశీల్దార్లు ఏ. పున్నం చందర్, ఆర్. రాంబాబు లు అన్నారు. మంగళవారం బోనకల్ మండలం రావినూతల, రాపల్లి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి, భూ సమస్యలకు సంబంధించి రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించారు.