ఖమ్మం రూరల్ మండల రెవెన్యూ కార్యాలయంలో శుక్రవారం సబ్ రిజిస్టర్ గా జక్కి అరుణ బాధ్యతలు స్వీకరించారు. మండలంలో నెలకొన్న భూ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని సబ్ రిజిస్టర్ అన్నారు. బాధ్యతలు స్వీకరించిన నూతన సబ్ రిజిస్టర్ ను మండల ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, అధికారులు, సిబ్బంది తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.