కూసుమంచి మండలం జీళ్ళచెరువు గ్రామంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పంచాయతీ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ కోటేశ్వరరావు, కార్యదర్శి శశికళ, రైతు వేదిక వద్ద ఏఈవో రవీందర్, ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అంబాల ఉమా శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.