ఖమ్మం రూరల్ మండలంలోని దివ్యాంగులకు మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం 50 శాతం రాయితీతో ఐకేపీ ఏపీఎం బస్ పాస్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం డిపో మేనేజర్ దినేష్ ఒక ప్రకటన విడుదల చేశారు. కాగా, ఎంవెంకటాయపాలెంలో నేడు(గురువారం) దివ్యాంగులకు బస్ పాసులు పంపిణీ చేయనున్నామని, దీనికి సదరమ్ సర్టిఫికెట్, ఆధార్ జిరాక్స్లు, ఒక ఫోటో, రూ. 50 తీసుకుని గ్రామపంచాయతీ కార్యాలయానికి ఉదయం 10 గంటలకు రావాలని తెలిపారు.