ఖమ్మం జిల్లా బోనకల్ మండల పరిధిలోని పలు గ్రామాలలో ఆదివారం జిల్లా కాంగ్రెస్ నాయకులు డాక్టర్ కోట రాంబాబు ముమ్మరంగా పర్యటించారు. ముందుగా మండల కాంగ్రెస్ నాయకులతో సమావేశమై పలు ప్రజా సమస్యలను స్వయంగా గ్రామ శాఖ నాయకులను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో మండల కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.