ఖమ్మం నగరంలో కాల్వడ్డు లో పెయింటింగ్ ఆఫీస్ లో, ఖమ్మం నగర గాంధీ చౌక్ అడ్డా పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెయింటింగ్ వర్కర్స్ అందరు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశంకు అధ్యక్షత ఎస్ కె సలీం వహించారు. సమావేశంలో వర్కర్స్ యొక్క పలు సమస్యలను గురించి చర్చించుకున్నారు. అనంతరం ఎన్నిక జరగగా ఎన్నికలలో అధ్యక్షుడిగా పావురాల నాగేశ్వరరావును ఏకగ్రీవం గా ఎన్నుకోవడం జరిగింది.