ఐదుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్

61చూసినవారు
ఐదుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్
పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను నేలకొండపల్లి ఎస్సై నాగరాజు అరెస్ట్ చేశారు. పోలీసు తెలిపిన వివరాల ప్రకారం నేలకొండపల్లి మండల పరిధిలోని మంగాపురం తండాలో పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు నేలకొండపల్లి ఎస్సై తోట నాగరాజు తన సిబ్బందితో దాడి చేసి పట్టుకున్నారు. వీరి వద్ద రూ 8, 100 నగదు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్